తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిగా ఉన్న దుర్గకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్‌త‌రోడా గ్రామానికి చెందిన మేర గంగామణి(36) అనే ఒంటరి మహిళ శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కగానొక్క కూతురు దుర్గ(11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలిక‌కు విద్య, వైద్యం, ఇత‌ర అవ‌స‌రాల‌కు అండ‌గా నిల‌వాల‌ని జిల్లా కలెక్టర్‌ అభిలాష్‌ అభినవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాలికను గురుకుల పాఠశాలలో చేర్పించి ఉచిత విద్యను అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు. వైద్య, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడ గ్రామంలో గుండెలు పిండే విషాదం చోటుచేసుకుంది. తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని విగత జీవిగా చూసిన ఆ కూతురుకి ఏం చేయాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. ఈ వార్త తెలుసుకున్న స్థానికులు మృతదేహాన్ని కిందకు దించారు. అయితే పూట గడవడమే కష్టంగా మారిని ఆ కుటుంబానికి అంత్యక్రియలకు కాసులు కరువయ్యాయి. ఆ కూతురు తల్లి మృతదేహం వద్ద ఎవరైనా సహాయం చేస్తారేమో అంటూ దీనంగా చూసింది. కానీ ఎవరూ తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వకపోవడంతో చివరకు తల్లికోసం కూతురు భిక్షాటన చేసింది. ఇంటి ముందు ఓ దుప్పటిని పరిచి అంత్యక్రియలకు సహాయం చేయాలను కోరుకుంటూ దీనస్థితిలో కూర్చున్న ఆ బాలికను చూసి అక్కడున్న వారందరికి కన్నీరు తెప్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *