One day tour package: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఒకే రోజులో యాదగిరిగుట్ట, శిల్పారామం, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాంతాలను సందర్శించే ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్ర ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. యాత్రి నివాస్ (ఉదయం 7 గంటలకు), పర్యాటక భవన్ (7:15 గంటలకు), సీఆర్వో కార్యాలయం (7:30 గంటలకు) నుంచి బస్సు బయలుదేరుతుంది. ముందుగా యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అల్పాహారం చేసిన తర్వాత శిల్పారామం, కొలనుపాక జైన దేవాలయాన్ని సందర్శిస్తారు.
ఆ తర్వాత భువనగిరిలో భోజనం చేసి స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకుంటారు. చివరగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి ఇకత్ చేనేత కళను వీక్షించి సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో ఏసీ మినీ బస్సు ప్రయాణం, అల్పాహారం, శాకాహార భోజనం, సాయంత్రం టీ, ఆలయ దర్శన సౌకర్యాలు ఉన్నాయి. పెద్దలకు రూ.2,070, పిల్లలకు రూ.1,770 చార్జీగా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్‌ను లేదా 98481 25720, 83672 85285 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే www.tgtdc.in/package/yadagirigutta-swarnagiri వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…