Mumbai Rains Schools And Colleges Closed: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా ముంబై, పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయగడ్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ఈ రోజు (గురువారం) సెలవు ప్రకటించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తరగతులు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
అయితే బీఎంసీ (BMC), నవీ ముంబై (NMMC), కళ్యాణ్-డొంబివ్లీ (KDMC), థానే (TMC) పరిధిలోని పాఠశాలలకు ఇప్పటివరకు సెలవు ప్రకటించలేదు. భారీ వర్షాలతో వర్లీ, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, జోగేశ్వరి, ముంబ్రా, నవీ ముంబై ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, హార్బర్ లైన్‌లో ఓవర్‌హెడ్ వైర్ తెగిపోవడంతో ముంబై లోకల్ రైలు సేవలు కూడా ప్రభావితమయ్యాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు