శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరిగిందో కాసేపు అర్ధం కాక అయోమయానికి గురయ్యారు అని సమాచారం. భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భూకంపం చోటు చేసుకున్న తరుణంలో, ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరుగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. మరోవైపు అధికారులు భూకంపంపై ఆరా తీస్తున్నారు . రెండేళ్ల క్రితం తరచూ భూప్రకంపనలు సంభవించాయి. ఏ ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పిల్చుకున్నారు.