Petrol Diesel Price Hike

Petrol Diesel Price Hike: గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.2.26 పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొంతమంది బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. తెలంగాణా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, డాలర్ రేటు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్రభుత్వంపై భారం పెరిగి, సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

గత 2–3 ఏళ్లలో ధరలు పెద్దగా పెరగలేదని, ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పెరగకపోయినా కొంత పెరుగుదల ఉండొచ్చని ఆయన తెలిపారు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం ఆపి, డ్యూస్‌తో పాటు అడ్వాన్స్ కూడా చెల్లించాలని డీలర్లపై ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. దీంతో సుమారు 40% బంకులు మూతపడినట్లు తెలిపారు. మరోవైపు కొరత భయంతో ప్రజలు ఎక్కువగా పెట్రోల్ తీసుకోవడం కూడా సమస్యను పెంచుతోంది. సరైన అవగాహన కల్పిస్తే ఈ కొరత కొంతవరకు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

షాకింగ్.. నగరంలో మూత పడుతున్న పెట్రోల్ బంకులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *