Puspak Buses Charges Reduction: గ్రేటర్ ఆర్టీసీ పుష్పక్ బస్సు చార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మరియు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ నుంచి శంషాబాద్‌కు రూ.200 వసూలు చేస్తుండగా, ఇప్పుడు రూ.100కి తగ్గించారు. ఆరామ్‌ఘర్‌కి చార్జీలు రూ.250 నుండి రూ.200కు, మెహదీపట్నం వరకు రూ.350 నుంచి రూ.300కు, పహాడీ షరీఫ్‌కు రూ.200 నుండి రూ.100కు తగ్గించారు. బాలాపూర్‌కి కూడా చార్జీలు రూ.250 నుంచి రూ.200కి తగ్గించారు.
అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉన్న నైట్ చార్జీల్లోనూ రూ.50 తగ్గింపు కల్పించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి జూబ్లీ బస్టాండ్, జేఎన్‌టీయూ, మియాపూర్, లింగంపల్లి వరకు ఉన్న చార్జీలు రూ.450 నుండి రూ.400కి తగ్గించగా, ఈ కొత్త చార్జీలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
Internal Links:
ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్..
మళ్లీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు, వరుసగా నాలుగోసారి..
External Links:
ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. బస్సు చార్జీల తగ్గింపు