స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో , #HarGharTirangaని గుర్తిండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మారుస్తున్నాను, అదే విధంగా మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://hargartiranga.com లో షేర్ చేయండి అంటూ మోదీ ట్వీట్ చేసారు. పలువురు నెటిజన్లు వేంటనే తమ ప్రొఫైల్ చిత్రాన్ని మువ్వెనల జెండాగా మార్చుకున్నారు.