Railways Has Arranged Special Trains: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణాలు నిలిచిపోవడంతో వేలాది మంది నేలపైనే నిద్రించాల్సి వచ్చింది. పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడకపోవడంతో ప్రయాణికుల సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ముందుకు వచ్చింది.
విమాన ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 114 అదనపు ట్రిప్పులు, 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అహ్మదాబాద్– ఢిల్లీ మార్గంలో ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ పథకం కింద 09497/09498 సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు డిసెంబర్ 7 నుంచి 9 వరకు నడుస్తోంది. ఈ రైలు సబర్మతి నుంచి ఉదయం 10:55కు బయల్దేరి మరుసటి రోజు 3:15కు ఢిల్లీ చేరుకుంటుంది. ఇలా ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లతో సదుపాయాలు కల్పిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!
భారీ లేఆఫ్స్ ప్రభావం – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!
External Links:
విమాన ప్రయాణికుల కష్టాలకు రైల్వే శాఖ చెక్.. ప్రత్యేక ట్రైన్ సర్వీసులు ఏర్పాటు