హైదరాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో రోజంతా (అంటే శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు (ఆరెంజ్ అలర్ట్) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ప్రత్యేక వాతావరణ బులెటిన్‌లో హెచ్చరించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండలో కూడా భారీ వర్షాలు ఉన్నటు తెలిపింది.
హైదరాబాద్‌లో రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది అని ఐఎండీ తెలిపింది.