నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బంది, వినియోగదారులు భయాందోళనకు గురై హోటల్ నుంచి పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వంట గదిలో నుంచి భారీగా మంటలు రావడాన్ని గమనించిన కార్మికులు, వినియోగదారులు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
హోటల్ కిచెన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. హోటల్ సిబ్బందితో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.