మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీశైలం మల్లన్న బ్రహోత్సవానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఇవాళ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఈవో ఎం.శ్రీనివాసరావు ఆలయ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం వేదపండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ప్రసాదం అందించి వేదాశీర్వచనం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *