Telangana Bandh: నేడు (ఆగస్టు 22) తెలంగాణ బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు కొన్ని వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా, కొన్ని జిల్లాలు ఇప్పటికే బంద్ పాటిస్తున్నాయి. మోండా మార్కెట్‌లో మార్వాడీ వ్యాపారులు ఓ దళితుడిపై దాడి చేయడంతో ఈ ఆందోళన ఉధృతమైంది. ఈ ఘటనను ఓయూ జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండిస్తూ, గతంలో ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే, ఇప్పుడు మార్వాడీలు స్థానికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులపై దాడులు, వ్యాపారాల్లో జోక్యం అనేది సహించరానిదని పేర్కొంటూ ప్రజలందరూ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరలకు అమ్ముతూ స్థానిక వ్యాపారులను, కస్టమర్లను నష్టపరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఉపాధి అవకాశాలకు కూడా వారు ముప్పుగా మారారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తెలంగాణలో “మార్వాడీ గో బ్యాక్” ఉద్యమం వేడెక్కింది. కొందరు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు మార్వాడీలకు మద్దతు తెలుపగా, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాత్రం ఈ ఉద్యమానికి బలమైన మద్దతు ప్రకటించారు.
Internal Links:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 500 జనరలిస్ట్ ఆఫీసర్ జాబ్స్..
నీట్ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఫలితాలు విడుదల..
External Links:
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్!