News5am, Telugu Breaking News (07-06-2025): హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రోత్సాహంతో ప్రభుత్వం 65 వేల పెట్రోల్, డీజిల్ రహిత కొత్త త్రివీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఆటో రిక్షాల పరిమితులు ఉండటంతో కొత్త ఆటోలు రిజిస్ట్రేషన్ చేయడం కష్టంగా మారింది. తాజాగా జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, LPG, CNG ఆటోలకు అనుమతిస్తూ జీవో నెంబర్ 263 విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడనుంది.
జనాభా పెరుగుదల, పట్టణీకరణ, అపార్ట్‌మెంట్ల నిర్మాణం వంటివి ఆటో రిక్షాల డిమాండ్‌ను పెంచాయి. ఈ దృష్ట్యా ఓఆర్ఆర్ పరిధిలో 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు, 10,000 LPG ఆటోలు, 10,000 CNG ఆటోలకు అనుమతులు జారీ చేశారు. అలాగే, 25,000 పెట్రోల్/డీజిల్ ఆటోలలో ఇంజన్ మార్చి వాటిని ఎలక్ట్రిక్, CNG లేదా LPG వాహనాలుగా మార్చేందుకు కూడా అనుమతి ఇచ్చారు. కొత్తగా ఈ ఎకో ఫ్రెండ్లీ వాహనాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజా రవాణా మెరుగవుతుంది, కాలుష్యం తగ్గుతుంది మరియు దాదాపు 65,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
More Telugu Breaking News General:
Breaking News:
తొక్కిసలాట కలకలం: ఆర్‌సిబి ఉద్యోగిని అరెస్టు చేసిన పోలీసులుబేగంపేట- ప్యాట్నీ పరిధి
ఆక్రమణలపై హైడ్రా అధికారుల కొరడా…
More Telugu News: External Sources
సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి