ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ప్రేమ పేరుతో యువతిని మోసం చేయడం, శారీరకంగా వాడుకోవడం, సినిమా పేరుతో బ్లాక్ మెయిల్ చేయడం, రెండు కోట్లు దండుకోవడం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్క్రిప్ట్‌పై చర్చించడానికి విల్లాకు పిలిచారు మరియు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు లైంగీకదాడికి పాల్పడ్డాడని, ఆ వీడియో రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వాపోయింది.

ఈ నేపథ్యంలో మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష సాయిని విచారణకు తీసుకురావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. హర్ష సాయిని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసుల విచారణ ముమ్మరం చేస్తున్నారు. హర్షపై నార్సింగ్ పోలీసులు ఇప్పటికే సెక్షన్ 376, 354, 328 కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరించడం ప్రారంభించారు. కానీ హర్ష తరపు లాయర్ చిరంజీవి మాత్రం హర్ష అమాయకుడని, డబ్బు కోసం యువతి హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. న్యాయపోరాటం జరిగిందని, సినిమా నిర్మాణంలో కొన్నాళ్లు కలిసి ఉన్నామని, అత్యాచారం ఆరోపణలు సరికాదని, ఫిర్యాదు చేసిన యువతి ఏడాది నుంచి హర్ష సాయిని కలవడం లేదని హర్ష తరపు లాయర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *