ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా సౌరా గ్రామానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తి నెలన్నర వ్యవధిలో ఆరుసార్లు పాముకాటుకు గురయ్యాడు. పాములు అతనిపై దాడి చేసిన ప్రతిసారీ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
మొదటి సంఘటన జూన్ 2 న తన ఇంట్లో మంచం మీద నుండి లేచిన తర్వాత వికాస్ దూబే కాటుకు గురయ్యాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జూన్ 2 నుంచి జూలై 6 మధ్య దూబే ఆరుసార్లు పాము కాటుకు గురయ్యాడు.