ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మీర్జా ఖాజా పాషా (38), తొగటి వెంకటేష్ (28) మృతి చెందారు.మెట్‌పల్లి మండలం చౌలమద్ది సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి పట్టణం ముస్లింపురానికి చెందిన ఖాజాపాషా తన ఇద్దరు కుమార్తెలు అయేషా, అలీషాతో కలిసి కోరుట్ల వెళ్లి తిరిగి వస్తున్నారు.కాగా, కోరుట్లకు చెందిన వెంకటేష్, ఇందూరి శ్రీనివాస్‌లు మెట్‌పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్నారు. చౌళమద్ది శివారులో రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఖాజాపాషా, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వారిని కోరుట్ల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.శ్రీనివాస్, అయేషా, అలీషాలను మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.మెట్‌పల్లి ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.