హైదరాబాద్: రెండు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు రూ.2 లక్షలు లంచం తీసుకున్న దూద్‌బౌలి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అమైర్ ఫరాజ్, గోపీసింగ్ అనే ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ బుధవారం అరెస్టు చేసి, ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. శాలిబండ నివాసి సయ్యద్ షాబాజ్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. లంచం డిమాండ్ వ్యవహారం ఏసీబీకి చేరడంతో అధికారులు వల వేసి పట్టుకున్నారు. ఫరాజ్ మరియు సింగ్‌లను కోర్టు ముందు హాజరుపరచగా, వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.