బలగం సినిమా ప్రేకక్షులను ఎంతగా ఆకట్టుకుందో మన అందరికి తెలుసు. వేణు ఎల్దండి మొదట కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి అంచలంచలుగా ఎదిగి సినీపరిశ్రమలో ఎంతగానో అనుభవం పొందాడు. అగ్ర నిర్మాత అయినా దిల్ రాజు బ్యానర్ లో జబర్దస్త్ కమెడియన్ అయినా వేణు ఎల్దండి మొదటి డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రంగా ‘బలగం’ నిలిచినా విషయం తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు అవార్డులు కూడా కైవసం చేసుకుంది. ఈ సినిమాలో తెలంగాణ కుటుంబ మూలాల విధానాన్ని మరియు , బావోద్వేగాలను, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను దర్శకుడు వేణు ఎల్దండి చక్కగా రూపొందించారు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో 8 కేటగిరీల్లో ఎంపిక అయ్యి తమ సత్తా చాటింది. ఈ విషయాన్ని బలగం చిత్రం నిర్మాత దిల్ రాజు తన ఎక్స్ వేదికగా తెలిపాడు.
బలగం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహయ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ లిరిక్స్, ఉత్తమ సహయ నటితో పాటు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్( మేల్, ఫిమేల్) కేటగిరీల్లో నామినేట్ అయ్యింది అని పేర్కొన్నాడు. వీటికి సంబందించిన అవార్డు ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఫిల్మ్ ఫేర్ ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, గాజుల సాయిలు పాత్ర పోషించాడు. కావ్య కల్యాణ్‌రామ్ హీరోయిన్ గా నటించగా వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి పలు కీలక పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అక్కటుకున్నారు.