Akhanda-2

Balayyas Rampage In 24 Hours: బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2 రాబోతోందని అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. ఒకసారి వాయిదా పడ్డ ఈ సినిమా ఇక మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు రాత్రి 9 గంటల షోతో అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌ను చూస్తుంటే బాలయ్య మాస్ స్టామినా స్పష్టంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో అఖండ 2కి 1,13,000 టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం హైదరాబాద్‌లోనే బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 3 కోట్లను దాటాయి. ప్రీమియర్ షోల బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు, అవి ఓపెన్ అయితే మరింత వేగంగా బుకింగ్స్ పెరుగుతాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు బుక్ మై షో ద్వారా అఖండ 2 ప్రీ-సేల్స్ రూ. 15.5 కోట్లను దాటాయి. ఆఫ్‌లైన్ కలెక్షన్లు కూడా కలిస్తే డే 1 భారీ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇది బాలయ్య మాస్ పవర్‌కు నిదర్శనం.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

24 గంటల్లో బాలయ్య ఊచకోత.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *