Cyclone Arnab 6 Dead: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టం కలిగించింది. ముఖ్యంగా గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేలాది చెట్లు, 10 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాన్ సంబంధిత ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. అనకాపల్లి జిల్లాలో వంతెనలు దెబ్బతినడంతో సుమారు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మచిలీపట్నంలో రహదారులు నీటమునిగాయి.
మరోవైపు, తుఫాన్ ప్రభావంతో వరి పంట నేలకొరిగి, కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. గోపాలపట్నంలో అత్యధికంగా 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు రహదారులపై చెట్లను తొలగించడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం, బాధిత గ్రామాలకు సహాయం అందించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!