Chiranjeevi Special Wishes Kalyan Babu: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన తమ్ముడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ పవన్‌పై తన ప్రేమ, గర్వాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో బాధ్యత, నిబద్ధత, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని కొనియాడారు.
ఉప ముఖ్యమంత్రిగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. పిఠాపురం ప్రజలకు కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. పవన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, తెలుగు ప్రజల మెప్పు పొందే నాయకుడిగా ఎదగాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!