Demonte Colony 3

Demonte Colony 3 : హారర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో విజయవంతమైన హారర్ ఫ్రాంచైజీ ‘డెమోంటే కాలనీ’ మూడో భాగంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డెమోంటే కాలనీ 3’ను 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీతో పాటు విడుదల చేసిన పోస్టర్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ‘చీకటికి సిద్ధంగా ఉండండి.. డెమోంటే కాలనీ 3 తలుపులు తెరుచుకోబోతున్నాయి’ అనే క్యాప్షన్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.

ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. 2015లో విడుదలైన తొలి ‘డెమోంటే కాలనీ’ భారీ విజయాన్ని సాధించగా, 2024లో వచ్చిన ‘డెమోంటే కాలనీ 2’ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మూడో భాగం మొదటి రెండు సినిమాల్లో మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు అతీంద్రియ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించనుంది. ఈ సినిమాలో రమేష్ తిలక్, సనంత్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, హెలెన్ టేలర్, సింగంపులి, ఎంఎస్ భాస్కర్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా భయపెడుతుందో చూడాలి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *