Shraddha Kapoors Eetha Teaser: ‘ఛావా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి వితాబాయి భావ్ మాంగ్ నారాయణ గావ్కర్ జీవిత కథ ఆధారంగా ‘ఈట’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా విడుదలైన టీజర్‌లో శ్రద్ధా కపూర్ వితాబాయి పాత్రలో అద్భుతంగా కనిపించింది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. టీజర్‌లో వితాబాయి జీవితంలోని భావోద్వేగభరితమైన సంఘటనలను చూపించారు. ముఖ్యంగా గర్భిణిగా ఉన్న సమయంలో కూడా వేదికపై ప్రదర్శన ఇవ్వడం, ప్రసవం తర్వాత మళ్లీ స్టేజ్‌పైకి వెళ్లి నృత్యం చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘స్త్రీ 2’ తర్వాత శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్