అక్కినేని నట వారసుడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్‌తో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య ఏ మాయ చేశావే సినిమాతో మంచి హిట్ కొట్టాడు. తనదైన శైలిలో, నటనతో తెలుగు అభిమానుల మనసును దోచుకొని ఎంతగానో క్రేజ్ తెచ్చకున్నాడు. ఏ మాయ చేశావే సినిమాతో నాగ చైతన్య , సమంత ఎంతో పేరు తెచుకున్నారు. సమంత , నాగ చైతన్యల మధ ప్రేమ పెళ్లిగా మారి వివాహం చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వాళ్ళ వాళ్ళు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

గత కొద్దికాలంగా నాగ చైతన్య, శోభితకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితున్నాయి. వారిద్దరూ పీకల్లోతు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చైతూ, శోభితా ఇద్దరు లండన్‌లోని ఓ హోటల్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారిద్దరి రిలేషన్‌ను నిజాం చేశాయి. ఇక ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ నేడు జరగనుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వీరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. శోభితా ధూళిపాళ గూఢచారి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా తెలుగు అభిమానులకు పరిచయం అయింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటె ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *