Jabardasth Fame Komurakka Attack

Jabardasth Fame Komurakka Attack: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో షాకింగ్ ఘటన జరిగింది. ‘జబర్దస్త్’ షో ద్వారా గుర్తింపు పొందిన కొమురక్కపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడి వెనుక ఆమె అసిస్టెంట్ శ్రీనాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొమురక్క ఇంట్లో బంగారం దొంగతనం జరగగా, శ్రీనాథ్ తానే దొంగిలించానని ఒప్పుకున్నాడు. తిరిగి ఇస్తానని చెప్పినా ఇవ్వకపోవడంతో, రెండు రోజుల క్రితం ఆమె అతడిని మందలించింది.

దీనికి కక్ష పెంచుకున్న శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి దాడి ప్లాన్ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో సుమారు 8 మంది ఆమె ఇంటికి వచ్చి అభిమానులమని చెప్పి బయటకు పిలిచారు. బయటకు రాగానే ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనతో కొమురక్క భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *