Michael Jackson Biopic Trailer: సంగీత ప్రపంచాన్ని మూడు దశాబ్దాల పాటు తన డ్యాన్స్, పాటలతో శాసించిన లెజెండ్ మైఖేల్ జాక్సన్. ఆయన మరణించి 25 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన మాయ తగ్గలేదు. ఇప్పుడు ఆ అద్భుతమైన ప్రయాణాన్ని వెండితెరపై చూపించేందుకు ‘మైఖేల్’ అనే సినిమా సిద్ధమైంది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ ట్రైలర్‌లో మైఖేల్ జాక్సన్ విజయాలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను కూడా భావోద్వేగంగా చూపించారు. చిన్న వయసులో తండ్రితో ఉన్న విభేదాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడిని స్పష్టంగా చూపించారు. ఒక సాధారణ బాలుడు ఎలా ప్రపంచవ్యాప్త ఐకాన్‌గా ఎదిగాడన్నదే ఈ సినిమా ప్రధాన కథ. ఇందులో మైఖేల్ పాత్రను ఆయన తమ్ముడి కుమారుడు జాఫర్ జాక్సన్ పోషించగా, ఆయన లుక్స్, డ్యాన్స్, బాడీ లాంగ్వేజ్ మైఖేల్‌ను గుర్తు చేసేలా ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, భారీ క్రేజ్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
మళ్లీ తిరిగొచ్చిన ‘కింగ్ ఆఫ్ పాప్’.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ అదుర్స్!