Mirai Review: మిరాయ్ ఓవర్శీస్ రివ్యూ.. తేజ సజ్జా హీరోగా, ఈగల్ సినిమాతో గుర్తింపు పొందిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం మిరాయ్. ఇందులో తేజ ఒక యోధుడిగా కనిపించబోతుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించటం సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ ఈ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు కలిగించాయి.
నిన్న రాత్రి మిరాయ్ ఓవర్సీస్‌తో పాటు నైజాంలో కూడా ప్రత్యేక ప్రీమియర్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రారంభం ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆకట్టుకునేలా సాగుతుంది. పాత్రల పరిచయం తర్వాత హైదరాబాద్ సెట్‌అప్‌లో వచ్చే కామెడీ అంతగా ఆకట్టుకోదు, కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. కానీ ప్రీ-ఇంటర్వెల్ వరకు ఉత్సాహం పెంచుతూ, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఇంటర్వెల్ బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. రెండో భాగం ప్రారంభంలో బాగా నడిచినా, తర్వాత కొంత స్లో అవుతుంది. స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల గజిబిజిగా అనిపించినా, క్లైమాక్స్ ముందు నుంచి మళ్లీ జోరందుకుని అద్భుతమైన ముగింపుతో సినిమాటిక్ ఫీల్ కలిగిస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ టీమ్ పని చెప్పుకోదగినది. గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సీన్లకు ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తేజ సజ్జా యోధుడిగా బాగా మెప్పించగా, మంచు మనోజ్ తన పాత్రలో అదరగొట్టాడు. కార్తీక్ ఘట్టమనేని ఒక గొప్ప విజువల్ అనుభవాన్ని అందించాడని చెప్పాలి.
Internal Links:
కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసిందిగా..