Preity Zinta: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారారు. బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ఆమె తాజాగా రూ.18.50 కోట్లకు విక్రయించారు. గత నాలుగు నెలల్లోనే ఆమె పెద్ద ఆస్తిని అమ్మడం ఇది రెండోసారి. గత ఏడాది నవంబర్‌లో ఇదే ‘రుస్తోమ్‌జీ పరిశ్రమ్’ బిల్డింగ్‌లోని 11వ అంతస్తులో ఉన్న మరో ఫ్లాట్‌ను రూ.14 కోట్లకు పైగా ధరకు విక్రయించారు.
తాజాగా 1,770 చదరపు అడుగుల మరో అపార్ట్‌మెంట్‌ను మార్చి 2, 2026న అమ్మగా, కొనుగోలుదారులు సుమారు రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. బాంద్రాలో దాదాపు రూ.100 కోట్ల విలువైన భారీ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఆమె ఈ ఆస్తులను విక్రయిస్తున్నట్లు టాక్ ఉంది. ఇదే సమయంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తుండగా, జీతేంద్ర మరియు ఏక్తా కపూర్ కూడా తమ అపార్ట్‌మెంట్‌ను రూ.12.25 కోట్లకు విక్రయించి వార్తల్లో నిలిచారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
వరుసగా ఆస్తులు అమ్మేస్తున్న ప్రీతీ జింటా..