THE PARADISE

THE PARADISE: సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో చూడటం తనకు ప్రత్యేకమైన అనుభూతి అని హీరో నాని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23 రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను ప్రేక్షకులతో కలిసి చూడేందుకు అనుమతించాలని నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. భద్రతా నిబంధనలు, అవసరమైన ప్రోటోకాల్స్‌ పాటిస్తామని ఆయన తెలిపారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు.

నాని రిక్వెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ భద్రతా నిబంధనలను గౌరవిస్తున్నందుకు అభినందించారు. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రద్దీ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుగా సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పోలీసులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సీఎం తన స్పందనలో తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేశారు. దీంతో నాని ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్‌ చూడటానికి పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

నాని స్పెషల్ రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్ రిప్లై.. అనుమతి విషయంలో ట్విస్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *