ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్.. తాజాగా ఆర్గాన్ డొనేషన్ కు సంబంధించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. మెట్రో రెట్రో పేరిట అవయవ దానంపై అవగాహన కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్ అవయవ దానం గురించి తెలుసుకుని తాను కూడా అవయవ దానం చేస్తానని అప్పటికప్పుడు ప్రకటించారు. మరణించిన తర్వాత తన అవయవాలను దానం చేస్తానని రాసిచ్చాడు. మన అవయవ దానం వల్ల వేరొకరికి జీవితాన్ని ఇస్తామని తెలిసి తాను కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలిపాడు. దాత అనుమతి కార్డు పట్టుకుని విశ్వక్ దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

విశ్వక్ సేన్ అవయవదానం చేశాడని తెలిసి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అవయవ దానం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి తాను కూడా అవయవదానం చేస్తానని వాగ్దానం చేసిన విశ్వక్ మంచి మనసు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ, జగపతి బాబు, అమిర్ ఖాన్ తదితరులు అవయవదానం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *