ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ గా మావోయిస్టులు మరణించారు. కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన భైరంగాడ్, దంతెవాడ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. ఇక ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనాస్థలి నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో మావోలు – పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని దంతెవాడ పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.