Aircraft Rules 2025

Aircraft Rules 2025: దేశంలోని విమానయాన భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక చర్య చేపట్టింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ ప్రమాదం నేపథ్యంలో, భద్రతను పెంచేందుకు ప్రభుత్వం “ఎయిర్‌క్రాఫ్ట్ (అడ్డంకుల తొలగింపు) నిబంధనలు-2025” అనే ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలతో విమానాశ్రయాల చుట్టూ ఉన్న అధిక ఎత్తైన భవనాలు, చెట్లు వంటి అడ్డంకులను తొలగించేందుకు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పొందుతారు. నిబంధనల ప్రకారం, నిర్దేశిత జోన్‌లలో నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ పనిలో ఉన్నారు.

నోటీసు అందిన 60 రోజుల్లో ఆస్తి యజమానులు తమ స్థల ప్లాన్‌లు, నిర్మాణ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇది విఫలమైతే, నిర్మాణాన్ని కూల్చడం లేదా ఎత్తును తగ్గించడంపై అధికారులు చర్య తీసుకుంటారు. అవసరమైతే గడువు మరో 60 రోజులు పొడిగించవచ్చు. అధికారులు భవనాలను తనిఖీ చేసేందుకు పగటిపూట ముందస్తు సమాచారం ఇచ్చి ఆస్తి పరిశీలన చేయవచ్చు. యజమానులు సహకరించకపోతే, ఉన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుని, డీజీసీఏ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లవచ్చు. దీనికి సంబంధించి యజమానులకు అప్పీల్ చేసే అవకాశమూ ఉంటుంది. వారు నిశ్చిత ఫారంలో, అవసరమైన పత్రాలతో రూ.1,000 ఫీజు చెల్లించి మొదటి లేదా రెండవ అప్పీలట్ అధికారిని ఆశ్రయించవచ్చు.

భారతీయ వాయుయాన్ అధినియమం 2024లోని సెక్షన్ 22 ప్రకారం, కేవలం అధికారిక ఉత్తర్వులను పాటించిన వారు మాత్రమే నష్టపరిహారానికి అర్హులు. కొత్త నిబంధనల ప్రకారం, నోటిఫికేషన్ తేదీ తర్వాత అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు ఎలాంటి నష్టపరిహారం వర్తించదు. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు లేదా అభ్యంతరాలను 20 రోజుల్లోగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తెలియజేయవచ్చు. ప్రభుత్వం Aircraft Rules 2025 నిబంధనల ద్వారా విమాన ప్రయాణాలను మరింత సురక్షితంగా మారుస్తుందని ఆశిస్తోంది.

Internal Links:

మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ..

ఎయిరిండియా విమాన బాధితులకు భారత సంతతి డాక్టర్ రూ.6 కోట్ల ఆర్థిక సహయం

External Links:

ఎయిర్‌పోర్టుల వద్ద నిర్మాణాలపై ఉక్కుపాదం.. విమాన భద్రతకు కొత్త ముసాయిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *