News5am, Big Telugu Breaking News (19-05-2025): ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారతదేశంపై కాల్పులకు పాల్పడింది.
భారత సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కాల్పుల్లో పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యం గల షాహీన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
అయితే, భారతదేశం ఈ ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. రష్యా తయారు చేసిన అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించి ఆ షాహీన్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ తన అధికారిక సోషల్ మీడియా వేదికలో విడుదల చేసింది.
ఇందులో పాకిస్తాన్ చేసిన దాడులను, భారత గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని ఎలా చేదించాయో స్పష్టంగా చూపించారు.
అంతేకాక, పాకిస్తాన్ వైమానిక స్థావరాలు నాశనమవుతున్న ఉపగ్రహ చిత్రాలను కూడా ఈ వీడియోలో చూపించారు.
షాహీన్ బాలిస్టిక్ క్షిపణి మద్య శ్రేణి భూమి నుంచి ప్రయోగించే రకానికి చెందినది. దీన్ని మొదటగా 2015 మార్చిలో పరీక్షించారు.
ఈ క్షిపణికి అణ్వాయుధాలు లేదా సంప్రదాయ పేలోడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నట్టు సమాచారం.
కానీ ఈ దఫా, పాకిస్తాన్ ఈ క్షిపణిని అణ్వాయుధేతర వార్‌హెడ్‌తో ప్రయోగించింది. అయినా, భారతదేశం తన గగనతల రక్షణ వ్యవస్థ S-400 సాయంతో దానిని సమర్థవంతంగా నిలిపివేసింది. S-400లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి – క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్‌లు, మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్.
ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, మరియు వేగంగా ప్రయాణించే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దీని విస్తృత పరిధి కారణంగా, NATO దేశాలు దీన్ని ప్రధాన ముప్పుగా పరిగణిస్తున్నాయి.