Cockroach Janta Party: Social mediaలో ‘Cockroach Janta Party (CJP)’ అనే వ్యంగ్య మీమ్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ట్రెండ్‌గా మారింది. అమెరికాకు చెందిన అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఈ గ్రూప్ కేవలం కొన్ని రోజుల్లోనే భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీల ఫాలోవర్లను దాటి 15 మిలియన్ల వరకు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఇంటర్నెట్‌లో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఫాలోవర్లు పెరుగుతున్న క్రమంలోనే భారత్‌లో దీని అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత నిర్వాహకులు కొత్త ఖాతాతో తిరిగి వచ్చి, తమపై వచ్చిన చర్యలపై స్పందిస్తూ మళ్లీ పోస్టులు పెట్టారు. కొద్ది గంటల్లోనే ఆ కొత్త ఖాతాకూ వేలల్లో ఫాలోవర్లు వచ్చారు.
ఈ ట్రెండ్ వెనుక అసలు కారణం ఇటీవల CJI చేసిన వ్యాఖ్యలు. నిరుద్యోగ యువత సోషల్ మీడియా, జర్నలిజం వైపు వెళ్లి “బొద్దింకలు, పరాన్నజీవుల్లా మారుతున్నారు” అన్న వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తర్వాత ఆయన స్పష్టత ఇచ్చినా అప్పటికే యువత ఆ పదాన్ని వ్యంగ్యంగా తీసుకుని “Cockroach Janta Party” పేరుతో డిజిటల్ నిరసన ప్రారంభించింది. ఆ పేరుతో ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు కూడా దాఖలయ్యాయి. దీంతో ఇది కేవలం మీమ్ కాదు, ఒక సోషల్ మీడియా ఉద్యమంలా మారిపోయి రాజకీయ పార్టీల స్థాయిలో చర్చకు కారణమవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!