High Level Meeting Chaired By Modi

High Level Meeting Chaired By Modi: భారత్-అమెరికా మధ్య టారిఫ్‌ల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య సఖ్యత దెబ్బతింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు హై-లెవల్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ట్రంప్ టారిఫ్‌లపై ఎలా స్పందించాలన్న దానిపై చర్చించనున్నారు. మొదట భారత్‌పై 25 శాతం సుంకం విధించగా, ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తరువాత రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు, ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో మొత్తం 50 శాతం సుంకం భారత్‌పై పడనుంది. ఈ ప్రభావం వస్త్రాలు, సముద్ర ఫుడ్, ఆటో రంగంపై తీవ్రంగా ఉండనుంది.

తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, సుంకాలపై భారత్‌తో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో రెండు దేశాల సంబంధాలు మరింత కఠినతరమయ్యాయి. మరోవైపు మోడీ కూడా స్పందిస్తూ, బెదిరింపులకు భారత్ భయపడదని, రైతుల ప్రయోజనాల కోసం టారిఫ్‌లను భరించడానికి సిద్ధమని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది సమావేశంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని చెప్పారు. భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మొత్తానికి, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి, హై లెవల్ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Internal Links:

మోదీ కోసం చేతితో రాఖీ తయారుచేసిన పాకిస్థాన్ సోదరి..

నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోడీ..

External Links:

నేడు మోడీ అధ్యక్షతన హై-లెవల్ భేటీ.. ట్రంప్ టారిఫ్‌లపై చర్చించే ఛాన్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *