News5am, Telugu Flash News (14-05-2025): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేశారు. ఆయన కేవలం ఆరు నెలలపాటు మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన పదవీ కాలం ముగియడంతో, జస్టిస్ బీఆర్ గవాయ్ భారత 52వ సీజేఐగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ ఖన్నా ఏప్రిల్ 16న జస్టిస్ గవాయ్ పేరును సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు వచ్చిన జస్టిస్ గవాయ్, వచ్చే ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా నియమితులైన రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం ప్రత్యేకత.
జస్టిస్ బీఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేరారు. 2003లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.
సుప్రీంకోర్టులో అనేక చారిత్రాత్మక తీర్పులిచ్చిన రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగంగా పని చేశారు. ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు వంటి కీలక అంశాలపై తీర్పులు ఇచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు.
More News:
Telugu Flash News
నేడు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం..
ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24 ఎన్డీఏ కీలక భేటీ..
More Flash News: External Sources
52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం..