Karnataka: కర్ణాటకలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో ఈద్ మిలాద్ ప్రదర్శనల సమయంలో వివాదాస్పద ఘటనలు జరిగాయి. శివమొగ్గ జిల్లా భద్రావతిలో జరిగిన ర్యాలీలో కొందరు యువకులు “పాకిస్తాన్ జిందాబాద్” అని నినాదాలు చేసినట్లు 12 సెకన్ల వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివమొగ్గ ఎస్పీ మాట్లాడుతూ వీడియో నిజమైనదా కాదా, ఎప్పుడు తీశారు, ఎవరు నినాదాలు చేశారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అదే సమయంలో విజయపురలో కూడా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఈద్ మిలాద్ వేడుకల్లో డీజే వాహనంలో రెచ్చగొట్టే ఆడియో ప్లే చేశారు. ఆ ఆడియోలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనలో డీజే వాహన యజమాని, ఆపరేటర్, అలాగే ‘MT Touseef15s’ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ యూజర్‌పై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Internal Links:
టోక్యోలో మోదీకి రాజస్థానీ స్వాగతం..
External Links:
కర్ణాటకలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!