News5am Telugu Latest News (08/05/2025) : లాహోర్ నగరాన్ని బాంబుల శబ్దం ఉలిక్కిపడేలా చేసింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పాకిస్తాన్లోని ముఖ్యమైన నగరమైన లాహోర్లో మూడు ప్రధాన ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని, సంబంధిత ప్రాంతాలను మూసివేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్ అధికారులు తెలిపారు.
పాక్ మీడియా అందించిన సమాచారం ప్రకారం, ఈ పేలుళ్లు మే 8వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో సంభవించాయి. వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో భారీ శబ్దాలతో పేలుళ్లు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల శబ్దాలతో భయభ్రాంతులకు గురైన ప్రజలు తమ ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని మీడియా పేర్కొంది. అయితే ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. గాలిలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
Latest Telugu News
More Telugu News :
అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్న సీఎం..
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి
More Latest News : External Sources
https://www.v6velugu.com/lahore-rocked-by-three-explosions-near-military-airport-at-walton-road-area