BJP Parliamentary Board Meeting

News5am, Latest Breaking Telugu News (22-05-2025): ప్రధాని మోదీ పహల్గాం ఉగ్రదాడిపై స్పందిస్తూ, అది 140 కోట్ల భారతీయుల మనసులను తాకిందని అన్నారు. ఆ దృశ్యం చూసిన తర్వాత తన రక్తం మరిగిపోయిందని, మైండ్ శాంతంగా ఉన్నా రక్తం వేడిగా మారిందన్నారు. రాజస్థాన్ బికనీర్‌లో 103 అమృత భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. కేవలం 23 నిమిషాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ పూర్తి చేశామని వెల్లడించారు. తన రక్తం వేడిగా ఉడికిపోతుందని, అందులో సిందూరం ఉందని మోదీ పేర్కొన్నారు. పాక్ ఈ విషయం మరచిపోవద్దని హెచ్చరించారు. స్వాతంత్య్రం తర్వాత పాక్ ఎన్నో సార్లు దాడి చేసిందని చెప్పారు. ప్రతీసారి ఓటమిని అనుభవించిందని తెలిపారు.
పహల్గాం దాడికి ముందు మోదీ సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని పాక్ మర్చిపోయిందని చెప్పారు. రాజస్థాన్‌లోని ఎయిర్ బేస్‌పై దాడికి పాక్ యత్నించిందని అన్నారు. ఆ కుట్రను తిప్పికొట్టి డ్రోన్లు కూల్చేశామని తెలిపారు. దానికి ప్రతిగా పాక్ ఎయిర్ బేస్‌లు ధ్వంసం చేశామని వెల్లడించారు.

More Latest National News:

Latest Breaking Telugu News:

భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు..

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర..

More Latest National Telugu News: External Sources

నా మైండ్ కూల్గా ఉన్నా.. రక్తం మరుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *