Oppose E20 Fuel

Oppose E20 Fuel: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 ఇంధనం (20% ఎథనాల్, 80% పెట్రోల్)పై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలో 52 శాతం మంది E20 ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపలేదు. కేవలం 22 శాతం మంది మాత్రమే దీనికి మద్దతు తెలిపారు. మరో 25.9 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. బీజేపీకి ఓటు వేసిన వారిలో కూడా 53 శాతం మంది E20 వాడేందుకు ఇష్టపడటం లేదని సర్వే తెలిపింది. అలాగే 55 శాతం మంది వాహనాలకు నష్టం జరిగే అవకాశం ఉందని, 52.8 శాతం మంది ఇంజిన్ దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు.

అదే సమయంలో 76 శాతం మంది సాధారణ పెట్రోల్‌తో పాటు E20 కూడా అందుబాటులో ఉండాలని, వినియోగదారులే ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. E20 ధర కూడా సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పాత వాహనాలకు E20ను తప్పనిసరి చేయడం సరికాదని 56.3 శాతం మంది తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం ఉండదని, చమురు దిగుమతులు తగ్గడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని చెబుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

పెట్రోల్‌పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *