Sir Deadline Extended To July 24

Sir Deadline Extended To July 24: ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24 వరకు పొడిగించింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం, బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. అలాగే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ పనులను కూడా అదే తేదీలోపు పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది.

జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని సెప్టెంబర్ 28 వరకు పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత అక్టోబర్ 3, 2026న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ను ప్రజలకు విస్తృతంగా తెలియజేసి, ఓటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

SIR గడువు పొడిగింపు.. ఈసీ సవరించిన షెడ్యూల్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *