APTRANSCO Recruitment: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTRANSCO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 200 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో ఎలక్ట్రికల్ – 167, సివిల్ – 23, టెలికాం – 10 పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో BE/B.Tech పూర్తి చేసిన 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎంపికైన వారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.75,000 స్థిర వేతనం, అనంతరం రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు పే స్కేల్ వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 20, 2026 వరకు స్వీకరిస్తారు. పరీక్షలు ఆగస్టు 22 నుంచి 29 మధ్య నిర్వహించనుండగా, దరఖాస్తు ఫీజు రూ.1,000. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apvidyutrecruitment.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!