Telangana TET 2026 Results

Telangana TET 2026 Results: తెలంగాణ టెట్ (TET) 2026 ఫలితాలను విద్యాశాఖ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో https://tgtet.aptonline.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.

జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,53,752 మంది దరఖాస్తు చేసుకోగా, 1,15,028 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 50,544 మంది (43.94%) అర్హత సాధించారు. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం జూలై 21న కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై ప్రతి ఏడాది నాలుగు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని, అందులో రెండు ఇన్-సర్వీస్ టీచర్లకు, రెండు సాధారణ అభ్యర్థులకు ఉంటాయని వెల్లడించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *