Parliament Special Sessions: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. గతంలో ఈ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో, ఈసారి ఆమోదం పొందేందుకు అవసరమైన మద్దతును కూడగట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బిల్లు నెగ్గాలంటే 540 మంది సభ్యులున్న లోక్సభలో సుమారు 360 మంది మద్దతు అవసరం.
ఈ బిల్లులకు మద్దతు కోసం డీఎంకే సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆగస్టు 13న ముగిసిన వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ప్రొరోగ్ కాకపోవడంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఈ నెల 26, 27 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ను దృష్టిలో ఉంచుకుని సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు