Gujarat: పాకిస్థాన్ నుంచి వలస వచ్చి గుజరాత్లో నివసిస్తున్న 319 మందికి భారతీయ పౌరసత్వం లభించింది. రాజ్‌కోట్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ వారికి పౌరసత్వ ధ్రువపత్రాలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్లే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌లో హిందూ కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తుచేస్తూ, భారత పౌరసత్వంతో వారు గౌరవంగా, భద్రంగా జీవించవచ్చని చెప్పారు.
పౌరసత్వం పొందిన వారిలో రాజ్‌కోట్‌కు చెందిన 259 మంది, మోర్బీ నుంచి 53 మంది, కచ్ నుంచి ఆరుగురు, సురేంద్రనగర్ నుంచి ఒకరు ఉన్నారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత పౌరసత్వం లభించడంతో కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఇకపై ఆధార్, ఓటరు ఐడీ పొందడంతో పాటు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఇల్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకు రుణాలు పొందే అవకాశం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..