Supreme Court: సీజేపీ (కాకరోచ్ జనతా పార్టీ) తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగల సమయంలో ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా సంయమనం పాటించాలని సూచించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాలతో రావాలని పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రజలకు సూచించారు.
మరోవైపు, భద్రతా కారణాలతో శుక్ర, శనివారాల్లో సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తున్నట్లు ఎన్డీఎంసీ ప్రకటించింది. నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు ప్రజలను కోరారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!