PM-Kisan

PM-Kisan: దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కో రైతుకు రూ.6,000 పెట్టుబడి సాయం అందుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది. ఇప్పటివరకు 19 విడతలుగా ఈ నిధులు పంపిణీ చేయగా, 20వ విడత పీఎం కిసాన్ సాయాన్ని ఆగస్టు 2న ప్రధాని మోదీ వారణాసిలో విడుదల చేయనున్నారు. సుమారు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,500 కోట్లకు పైగా నిధులు జమ కాబోతున్నాయి.

ఈ పథకం అందరికీ వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ.10 వేలకుపైగా పెన్షన్ పొందేవారు, డాక్టర్లు, ఇంజనీర్ల వంటి నిపుణులు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే, ఆధార్‌తో లింక్ చేయని బ్యాంకు ఖాతా కలిగి ఉండేవారు కూడా సాయం పొందలేరు. ముఖ్యంగా, ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్నవారు e-KYC ప్రక్రియ పూర్తి చేయకపోతే వారి ఖాతాలకు నిధులు జమ కాబోవు.

Internal Links:

మోడీ సరికొత్త రికార్డ్..

విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ…

External Links:

రైతులకు గుడ్న్యూస్.. బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *