PM Modi To Visit Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం వారణాసిలో పర్యటించనున్నారు. రక్షా బంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు గొప్ప బహుమతిని అందించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కింద దేశంలోని 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లకు పైగా నిధులను మోడీ బదిలీ చేయనున్నారు. ఈ మొత్తం నిధుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే రూ.4,600 కోట్లు కేటాయించబడింది, దీని ద్వారా 2.3 కోట్లకు పైగా రైతులు లాభం పొందనున్నారు. వారణాసిలోని 2.21 లక్షల మంది రైతులకు రూ.48 కోట్లు అందించనున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.6 వేలు, మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది.
వారణాసిలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా రూ.2,183.45 కోట్ల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 10:30కి ప్రధాని మోడీ లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.
Internal Links:
External Links:
రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం