Breaking National Telugu News

News5am, Breaking Telugu News-1: (13-05-2025):ప్రధానమంత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
భారత్ ఉగ్రవాదాన్ని ఎక్కడ ఉన్నా నిర్మూలించేందుకు కట్టుబడి ఉంది. “ఆపరేషన్ సిందూర్” ద్వారా భారత్ తన శక్తిని చూపించింది. పాక్‌కి గానీ, ఉగ్రవాద మద్దతుదారులకు గానీ ఇది బలమైన సందేశం. భారత రక్షణ దళాలు అసాధారణ శక్తి ప్రదర్శించాయని మోదీ తెలిపారు. ఈ యుగం యుద్ధాల యుగం కాదు, కానీ ఉగ్రవాదానికి తలొగ్గలేం.
భారత్ ఎలాంటి చర్యకైనా వెనకడుగు వేయదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని భారత్ క్షమించదని హెచ్చరించారు. పాక్ బతికాలంటే ఉగ్ర శిబిరాలను స్వయంగా తొలగించాలన్నారు. “ఉగ్రవాదం, చర్చలు రెండూ కలిసి జరగవు” అని మోదీ చెప్పారు. ఉగ్రవాదంపై అణుశక్తి ఆధారిత బెదిరింపులకు భారత్ తలవంచదన్నారు. భారత శక్తిని చిన్నచూపు చూడొద్దని మోదీ గట్టిగా హెచ్చరించారు.

More News:

Breaking Telugu News-1:

అల్లు అర్జున్-అట్లీ సినిమా, రిలీజ్ డేట్ లాక్..

ఎడతెరిపి లేని వర్షాలు..

More Breaking National Telugu News: External Sources

https://www.ap7am.com/tn/829142/modis-strong-message-on-indias-response-to-pakistan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *