Sahil Wakode Death: ఐఐటీ బొంబాయి విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్ష సమయంలో మొబైల్ ఉపయోగించాడనే ఆరోపణలపై సాహిల్‌ను ప్రశ్నించి బయటకు పంపుతున్న సీసీటీవీ వీడియోను ముంబై క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోంది. పరీక్షా కేంద్రం నుంచి హాస్టల్‌కు వెళ్లే వరకు అతడి కదలికలపై దర్యాప్తు కొనసాగుతోంది. సెప్టెంబర్ 18న సాహిల్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్ష, వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ, అవి ఇంకా నిర్ధారణ కాలేదు.
తొలుత సాహిల్ పరీక్షలో మొబైల్ ఉపయోగించి ప్రశ్నాపత్రాన్ని చాట్‌జీపీటీకి పంపినట్లు ఐఐటీ బొంబాయి తెలిపింది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు వ్యాఖ్యలు చేయడం సరికాదని తర్వాత స్పష్టం చేసింది. మరోవైపు పరీక్ష ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాకు ఫ్యాకల్టీ ఫోరం మద్దతు తెలిపింది. అకడమిక్ మాల్‌ప్రాక్టీస్‌పై సంస్థ నిబంధనల ప్రకారమే ఆయన వ్యవహరించారని పేర్కొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..